

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో కార్తీక్ ఆర్యన్ మోకాలికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను నిలిపివేసిన చిత్ర బృందం, ఆయనను ముంబైలోని ఫోర్టిస్ రాహేజా ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
గాయం తీవ్రత దృష్ట్యా కార్తీక్ ఆర్యన్‌కు మోకాలికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. సర్జరీ అనంతరం ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావచ్చని మూవీ టీమ్ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నటిస్తున్న ఇతర సినిమాల షూటింగ్ షెడ్యూళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రాణాపాయం ఏమీ లేదని, అయితే పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సమాచారం. ఈ వార్తతో ఆందోళన చెందిన అభిమానులు కార్తీక్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!