

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో పవర్‌ఫుల్, యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రష్మిక చేసే భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అణచివేతకు గురవుతున్న ఒక తెగ కోసం పోరాడే మహిళగా రష్మిక కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, విజయశాంతి నటించిన ప్రముఖ పోరాట చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ’లోని ఓ పాపులర్ పాటను ‘మైసా’ కోసం రీమిక్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆ పాటను ఈ సినిమాలో ఎలా ఉపయోగిస్తారన్న ఆసక్తి నెలకొంది. సినిమా కథ, నేపథ్యానికి అనుగుణంగా రీమిక్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తే అది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక పవర్‌ఫుల్ యాక్షన్ అవతారం, అండర్‌వాటర్ ఫైట్, ‘ఒసేయ్ రాములమ్మ’ పాట రీమిక్స్ వార్తలతో ‘మైసా’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!