

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాకా సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సాధించిన విజయంతో ఈ చిత్రంపై కూడా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం ఏకంగా రూ.150 కోట్లకు చేరవచ్చనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవికి ఉన్న మార్కెట్, సంక్రాంతి సీజన్‌లో సినిమాలకు లభించే ఆదరణ ఈ అంచనాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో కాకా చిత్రానికి కూడా భారీ స్థాయిలో లెక్కలు వేస్తున్నారు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తే రూ.200 కోట్ల వసూళ్లు సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటే రూ.250 కోట్ల మార్కును అందుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లెక్కలన్నీ నిజమవ్వాలంటే సంక్రాంతి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!