

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా మూడో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అనుకున్న దానికంటే వేగంగా చిత్రీకరణ పూర్తవుతోందనే వార్తల నేపథ్యంలో ‘ధర్మన్’ విడుదల తేదీపై కూడా కొత్త చర్చ మొదలైంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘ధర్మన్’ను సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్. అదే జరిగితే రజినీకాంత్ నుంచి తక్కువ వ్యవధిలో వరుసగా సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంక్రాంతి విడుదలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లెజెండరీ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పురోగతిని బట్టి విడుదల తేదీపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!