

క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు బుకింగ్‌కు ముందే ప్రయాణికుల నుంచి అదనంగా టిప్ వసూలు చేసే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ముందస్తు టిప్పింగ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించే, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా పరిగణించే అవకాశం ఉందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రధాన కమిషనర్ నిధి ఖరే తెలిపారు. ప్రయాణం పూర్తైన తర్వాత సేవలు నచ్చితే టిప్ ఇవ్వడం పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని స్పష్టం చేశారు.
ర్యాపిడోను నిర్వహించే రోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌పై సీసీపీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. బుకింగ్ సమయంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే రైడ్ లభించే అవకాశం పెరుగుతుందని సూచించడం, అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించాలని ప్రోత్సహించడం వంటి సందేశాలను సీసీపీఏ తప్పుబట్టింది. అలాగే ధర నిర్ణయించే విధానంలో వినియోగదారులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రభావితం చేసే రూపకల్పనను ‘డార్క్ ప్యాటర్న్’గా గుర్తించింది. ఉబర్, ఓలా తదితర సంస్థల అడ్వాన్స్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై కూడా సీసీపీఏ పరిశీలన కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!