

రణబాలి’ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ పీరియాడిక్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా రష్మిక తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకోగా, ఇప్పుడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా మొత్తం చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తెలియజేశారు. తన యూనిట్ సభ్యులతో కలిసి ‘రణబాలి’ డైలాగ్ చెబుతున్న క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మొత్తం 130 రోజుల పాటు జరిగిన చిత్రీకరణను తన బృందంతో కలిసి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!