

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పరేడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!