17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

Writer: Chandrika 09:36 AM, 17 సెప్టెంబర్, 2026
టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

సినిమాల చిత్రీకరణను ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అనువైన వాతావరణం కల్పించడం, కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రపంచస్థాయి నిర్వహణ సామర్థ్యాలు రామోజీ ఫిల్మ్‌ సిటీ (ఆర్‌ఎఫ్‌సీ) విజయానికి ప్రధాన కారణాలని రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ తెలిపారు. కెనడాలోని టొరొంటోలో జరుగుతున్న 51వ టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టిఫ్‌)లో భాగంగా నిర్వహించిన భారత్‌ పర్వ్‌ రిసెప్షన్‌కు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ‘భారత్‌ మీడియా-వినోద రంగంలో సరికొత్త అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్యానెల్‌ చర్చలో కిరణ్‌ మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ విజయేశ్వరి, ఈటీవీ ఎండీ కె. బాపినీడు కూడా చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు సత్కరించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. టొరొంటోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్‌, కెనడాకు చెందిన సృజనాత్మక రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో సుమారు 2,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తింపు పొందిందని కిరణ్‌ వివరించారు. అంతర్జాతీయ చిత్ర పరిశ్రమకు అవసరమైన సమగ్ర నిర్మాణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సేవలను అందించే సామర్థ్యం ఆర్‌ఎఫ్‌సీకి ఉందన్నారు. చిత్రీకరణ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు ఒకే వేదికపై అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, నిర్ణీత సమయంలో సినిమాను పూర్తి చేసేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తారని తెలిపారు. భారత్‌లో ఇంతకుముందు చిత్రీకరణ చేయని కెనడా, అమెరికా చిత్ర నిర్మాతలకు ఆర్‌ఎఫ్‌సీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కిరణ్‌, విజయేశ్వరి, బాపినీడు కెనడా ఫెడరల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మార్క్‌ మిల్లర్‌ను కలిశారు. భారత్‌-కెనడా మీడియా, వినోద రంగాల మధ్య సహకార అవకాశాలపై చర్చించారు. టిఫ్‌ మార్కెట్‌లోని భారత్‌ పెవిలియన్‌ ద్వారా భారత చిత్ర నిర్మాణ సామర్థ్యాలను అంతర్జాతీయ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీ తన సమగ్ర చిత్ర నిర్మాణ మౌలిక వసతులను అక్కడ ప్రదర్శిస్తోంది. కెనడా చిత్ర నిర్మాతలు, స్టూడియోలు, పంపిణీ సంస్థలు భారత్‌తో కలిసి పనిచేయాలని, వేవ్స్‌ సమ్మిట్‌ 2027 వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని భారత అధికారులు ఆహ్వానించారు. సహ నిర్మాణం, మార్కెట్‌ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ కంటెంట్‌ రూపకల్పనతో పాటు యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌, అంతర్జాతీయ పంపిణీ రంగాల్లో సహకారానికి అవకాశాలున్నాయని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

ట్యాగ్లు
రామోజీ ఫిల్మ్‌ సిటీటొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌టిఫ్‌ 2026సీహెచ్‌ కిరణ్‌రామోజీ గ్రూప్‌భారతీయ సినిమాచిత్ర నిర్మాణంమీడియా వినోద రంగంభారత్‌ కెనడా సంబంధాలుఫిల్మ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌భారత్‌ పర్వ్‌హైదరాబాద్‌ ఫిల్మ్‌ సిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!