

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘దాదా’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, షూటింగ్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుమారు 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ సంస్థ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!