

కోట్లాది మందిని తన హాస్యంతో నవ్వించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం కుటుంబంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నయ్య శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో శ్రీవదన్ తన కుటుంబ పరిస్థితిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆరుగురు సంతానంలో నలుగురు మృతి చెందారని, ప్రస్తుతం తామిద్దరే మిగిలామని, అయితే తాను మాత్రం ఒంటరిగా ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బ్రహ్మానందం తన సొంతూరికి వచ్చినప్పటికీ తనను పలకరించకుండా వెళ్లిపోయారని శ్రీవదన్ తెలిపారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ‘అన్నయ్యా.. ఎలా ఉన్నావు?’ అని ఒక్క మాట అడుగుతాడేమోనని తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. వృద్ధాప్యంలో తోడబుట్టినవారి పలకరింపు ఎంతో విలువైనదని పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయంపై బ్రహ్మానందం నుంచి ఎలాంటి స్పందన వెలువడిందనే విషయం స్పష్టంగా తెలియలేదు.














కామెంట్స్ (1)
May be gossip I hope Brahmanandam is not such kind of a person