

2026 ముగియడానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్నప్పటికీ టాలీవుడ్‌లో 2027 సంక్రాంతి సినిమాల సందడి అప్పుడే మొదలైంది. పండుగ రేసును లక్ష్యంగా చేసుకున్న పలు భారీ చిత్రాలు ఇప్పటికే షూటింగ్‌లను వేగంగా కొనసాగిస్తున్నాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158, నాగార్జున ‘కింగ్ 100’, రవితేజ-విష్ణు-హసిత్ గోలి చిత్రం, వెంకటేష్-కల్యాణ్ రామ్-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్, శర్వానంద్-శ్రీను వైట్ల సినిమా వంటి చిత్రాలు తమ పనులను చకచకా పూర్తి చేసుకుంటున్నాయి. దీంతో సంక్రాంతి పోటీపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ రేసులో దర్శకుడు మారుతి మాత్రం కొంత వెనుకబడినట్లు కనిపిస్తున్నారు. పండుగ సీజన్‌కు సరిపోయే ‘హ్యాపీ పొంగల్’ను ఆయన తెరకెక్కించనున్నట్లు ముందే ప్రచారం జరిగింది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి కీలక అప్‌డేట్ రాలేదు. మిగతా చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్‌లను కొనసాగిస్తుండటంతో ‘హ్యాపీ పొంగల్’ విషయంలో ఆలస్యం చర్చనీయాంశంగా మారింది. పండుగ రేసులో నిలవాలంటే సినిమా షూటింగ్‌ను త్వరగా ప్రారంభించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘రాజా సాబ్’ ఫలితం తర్వాత మారుతి తన తదుపరి ప్రాజెక్ట్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలువురు స్టార్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘హ్యాపీ పొంగల్’ టీమ్ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!