

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ 10వ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై ఆసక్తి పెరిగింది. గత సీజన్‌లో ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన కామనర్స్‌కు అవకాశం కల్పించిన నిర్వాహకులు, ఈసారి కూడా ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికైన కొందరిని హౌస్‌లోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అగ్నిపరీక్ష 2లో పాల్గొంటున్న కంటెస్టెంట్లు తమ టాలెంట్‌తో పాటు భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇక ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కామనర్స్‌కు గతంతో పోలిస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ అందించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో కామనర్‌కు రోజుకు సుమారు రూ.60 వేల వరకు చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు పలువురు సీరియల్ నటీనటులు కూడా ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి, బాలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తుది కంటెస్టెంట్ల జాబితాపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!