

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్‌లోగా తప్పనిసరిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికలు గడువులోగా జరగకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి లభించాల్సిన నిధులపై ప్రభావం పడుతుందని సీఎం పేర్కొన్నారు. 2026–31 కాలానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సుమారు రూ.16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,158 కోట్ల గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్‌కు సిఫారసు అయ్యాయి.
మరోవైపు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసుల కారణంగా 2021లో ఎన్నికలు జరగని 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఈసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ నియామకాల్లో ఐటీ నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో జాప్యానికి తావులేకుండా రియల్‌టైమ్‌లో పనిచేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆదా సాధించిన విద్యుత్ శాఖను, కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న పురపాలక శాఖను చంద్రబాబు అభినందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!