

మలయాళ నటి హనీ రోజ్పై గతంలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వివాదంలో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్ బహిరంగ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల హనీ రోజ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరించిన ఆయన, ఫేస్బుక్ పోస్టు ద్వారా హృదయపూర్వక క్షమాపణలు కోరారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించడం తన ఉద్దేశం కాదని, సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసినందుకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని కూడా హనీ రోజ్‌ను కోరారు.
ఈ క్షమాపణలను హనీ రోజ్ సానుకూలంగా స్వీకరించినట్లు మలయాళ సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలా లేదా అన్న విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపినట్లు సమాచారం. ఈ వివాదం గతంలో బాబీ చెమ్మన్నూర్ చేసిన అసభ్యకర, లైంగిక సూచనలతో కూడిన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. హనీ రోజ్ ఫిర్యాదు మేరకు 2025లో ఆయనపై లైంగిక వేధింపులు, ఐటీ చట్టం కింద కేసులు నమోదై అరెస్టు కూడా జరిగింది. ఇప్పుడు బహిరంగ క్షమాపణలతో ఈ వివాదానికి ముగింపు పలకాలనే ప్రయత్నం కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!