
జనరల్

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (శరద్ చంద్ర పవార్) కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తెలిపారు. లౌకిక సిద్ధాంతాలను నమ్మే వారందరికీ కాంగ్రెస్‌లో స్వాగతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
2023లో ఎన్‌సీపీ చీలిన తర్వాత పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం కాంగ్రెస్‌లో విలీనం కావాలని కోరుకుంటుండగా, మరో వర్గం ఎన్‌డీఏలో చేరాలని భావిస్తోంది. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!