

బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘హ్యాంగ్‌మెన్’ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్లపై వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి.హెచ్. రావు నిర్మించిన ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించగా, ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, దర్శకురాలు నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, ఉరిశిక్ష అమలు చేసే వ్యక్తి మానసిక స్థితిని కథగా మలచడం గొప్ప ఆలోచన అని దర్శకుడు విహాన్‌ను అభినందించారు. బ్రహ్మాజీ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల నటుడని, ఈ చిత్రం ఆయనకు గొప్ప విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్, నిర్మాత అజయ్ మైసూర్, దర్శకుడు విహాన్ తదితరులు కూడా సినిమా కథ, సామాజిక సందేశం, నటీనటుల ప్రదర్శనపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులు తప్పక ఆదరించాలని కోరారు. జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలతో ఆసక్తి మరింత పెరిగింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!