
బిజినెస్

కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తొలి చిత్రం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈ నగరానికి ఏమైంది 2ను ప్రకటించిన మేకర్స్, ఈ చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. థియేటర్లలో సాధారణ విజయమే సాధించిన తొలి చిత్రం ఓటీటీ ద్వారా విశేష ఆదరణ పొందింది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. ఇదే సమయంలో ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!