
సినిమాలు

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఎప్పటినుంచో కలగంటున్న సంగతి తెలిసిందే. 2019లో ప్రజలు అవకాశం ఇవ్వకపోయినా, ఇప్పుడు మళ్లీ సీఎం కాగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ను రీస్టార్ట్ చేశారు. కానీ 29 గ్రామాల పరిధి సరిపోదని, అభివృద్ధికి రైతుల ఇంకోసారి సహకారం అవసరమని ఆయన చెప్పడం రాజధాని పేరిట మళ్లీ భూదాహం ప్రారంభమైందనే టాక్ మొదలైంది.
ఇక కొత్త ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేర్లతో మరో 40 వేల ఎకరాలు అవసరమని చెప్పడం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రజలు, రైతుల నుంచి వ్యతిరేకత వస్తోందని తెలిసినా, చంద్రబాబు “భూమి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు” అన్నట్లు మాట్లాడటం ఇది నిజంగా అభివృద్ధి కోసమేనా? లేక పాత కల కోసం కొత్త భూదాహం డ్రామా మళ్లీ మొదలైందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!