

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కించనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో షాహిద్ కపూర్‌తో కలిసి నటించేందుకు ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను రష్మిక సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ఈ నిర్ణయానికి కారణం ఆమె వ్యక్తిగత జీవితం అని ప్రచారం జరుగుతోంది. త్వరలో హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకోనున్న నేపథ్యంలో పెళ్లి, రిసెప్షన్ కార్యక్రమాల తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం రష్మిక చేతిలో షాహిద్ కపూర్‌తో చేస్తున్న కాక్టెయిల్-2 మరియు తెలుగులో మైసా సినిమాలు ఉన్నాయి. ఇందులో కాక్టెయిల్-2 షూటింగ్ దాదాపు పూర్తవగా, మైసా చిత్రం ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులను తగ్గించుకుందనే ప్రచారం మరింత బలపడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!