

హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తమిళంలో గిల్లి సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసిన త్రిష ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా కొనసాగుతోంది.
ఇక ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి. తమిళ నటుడు శింబుతో సినిమాలు చేస్తూ ఉండగా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో కూడా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని రూమర్లు వచ్చాయి. అయితే ఆ వార్తలు కొంతకాలానికి తగ్గిపోయాయి. అనంతరం త్రిష, టాలీవుడ్ హీరో రానాతో స్నేహం పెంచుకుని కొంతకాలం డేటింగ్లో ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి.
అలాగే కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. అలాగే ధనుష్‌తో కూడా ఆమెకు సంబంధం ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. తర్వాత 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో త్రిష ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదనే షరతు నచ్చకపోవడంతో ఆమె ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం మరోసారి విజయ్‌తో త్రిష దగ్గరగా కనిపించడం వల్ల వారి సంబంధంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!