

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సంచలన హిట్స్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్, హీరో క్యారెక్టర్ డిజైన్‌లో ఆయన స్టైల్‌కి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ పోలీస్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆడియో గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ రెడీ అవుతుండగా, మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రధాన షూటింగ్ పూర్తి చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2026లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలన్నదే మేకర్స్ లక్ష్యం.
ఇదిలా ఉండగా, ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈలోగా సందీప్ స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు ‘డెవిల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం సాగుతోంది. 2023లోనే ఈ కథను మహేష్ బాబుకు వినిపించానని, అది ‘యానిమల్’ కంటే ఎక్కువ ఇంటెన్స్‌గా ఉంటుందని సందీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. అప్పట్లో డేట్స్ కారణంగా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో రా అండ్ డార్క్ టోన్‌లో ఈ సినిమా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు క్లాస్ ఇమేజ్‌తో కనిపించిన మహేష్, ఈ స్టైల్లో కనిపిస్తే అది టాలీవుడ్‌కు గేమ్‌చేంజర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే, ఈ కాంబినేషన్‌పై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!