

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు పూర్తిగా వెల్లడికాకపోయినా, సినిమా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారని, ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండటంతో పాటు పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తండ్రి, కొడుకు పాత్రల్లో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని, కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉంటుందని టాక్. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!