
టెక్నాలజీ

‘బాహుబలి’తో భారత సినిమాకి కొత్త చరిత్ర రాసిన ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు మరోసారి మాహిష్మతి ప్రపంచాన్ని పునర్జన్మ పొందేలా చేయబోతున్నారట. ఈసారి మాత్రం లైవ్ యాక్షన్ కాదు. AI ఆధారిత యానిమేషన్ వెర్షన్లో ‘బాహుబలి 3’ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.
ప్రభాస్, అనుష్క, రానా బిజీ షెడ్యూల్స్ కారణంగా లైవ్ యాక్షన్ కష్టమవడంతో రాజమౌళి ఈ కొత్త దారిని ఎంచుకున్నారట. కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారని సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ మాసివ్ ప్రాజెక్ట్‌పై పని చేయబోతున్నారు. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. “మళ్లీ మాహిష్మతి! కానీ ఈసారి పిక్సెల్స్‌లో!” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.











కామెంట్స్ (4)
We are eagerly waiting
మళ్లీ రాజమౌళి మ్యాజిక్ చూడబోతున్నాం!
మళ్లీ మాహిష్మతి! ఈసారి మరో లెవెల్లో! 🔥👑
మళ్లీ మహిష్మతి! కానీ ఈసారి పిక్సెల్స్‌లో : )