
సినిమాలు

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘రాకా’పై ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె, ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్నా జూలైలో ముంబైలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండే అవకాశం ఉందని, కొత్త గెటప్‌లో కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, విజయ్ దేవరకొండతో ‘రణబాలి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!