
రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో పీఏసీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ పరిస్థితులపై తమ అభిప్రాయాలను మీనాక్షి నటరాజన్‌కు వెల్లడించినట్లు సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు కోసం కష్టపడిన పాత కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!