
షోస్

టాలీవుడ్లో ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ‘పెద్ది’ సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట గుర్తున్నారా? తాజాగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భద్రతా బాధ్యతలు చూసుకున్న కెవిన్.. ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేయడం లేదని టాక్ వినిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పర్సనల్ బాడీగార్డ్‌గా కెవిన్ జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో నాగార్జున పక్కన కెవిన్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. గతంలో కెవిన్ రోజుకు రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, నాగార్జున టీమ్‌లో ఆయన చేరినట్లు వస్తున్న వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!