

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సమయంలో స్వల్ప కండరాల గాయానికి గురైన బాలకృష్ణ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌పై పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి. జూన్‌లో అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా రద్దయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని అక్టోబరు 2026లో రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సినిమా రద్దయిందని చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న వార్తలను కేవలం ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘దేవర 2’ విషయంలో కూడా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బాలయ్య సినిమా అంశం మరింత చర్చకు దారితీస్తోంది. ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని ప్రచారం జరిగింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!