
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ముందు వరుసలో కూర్చోవడంపై డీఎంకే అధికార పత్రిక ‘మురసొలి’ తీవ్ర విమర్శలు చేసింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమంలో విజయ్, త్రిష పరస్పరం సెల్యూట్ చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. అధికారిక కార్యక్రమంలో ఇలాంటి ప్రదర్శన సముచితం కాదని తన సంపాదకీయంలో పేర్కొంది.
విజయ్ తల్లిదండ్రుల పక్కన త్రిష ముందు వరుసలో కూర్చోవడం, కార్యక్రమం సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ విమర్శలు వచ్చాయి. విజయ్-త్రిష స్నేహంపై చాలాకాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత సంబంధంపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ అంశంపై వచ్చిన వార్తలు, విమర్శలు రాజకీయంగా కూడా చర్చకు దారితీశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!