
ఆరోగ్యం

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మాస్ యాక్షన్ చిత్రం ఎన్‌బీకే 112పై సోషల్ మీడియాలో వస్తున్న పలు వార్తలకు చిత్రబృందం ఫుల్‌స్టాప్ పెట్టింది. సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ నిరాధారమైన పుకార్లేనని, అభిమానులు వాటిని నమ్మవద్దని అధికారికంగా వెల్లడించింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే 111లో బాలకృష్ణకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్‌బీకే 112 చిత్రీకరణ ప్రారంభమవుతుందని యూనిట్ తెలిపింది. ఈ సినిమా జూన్ 25న అమరావతిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మంత్రి నారా లోకేశ్ తొలి క్లాప్ కొట్టారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!