

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి ఈరోజు హైదరాబాద్ అబిడ్స్‌లోని శ్రీశ్రీ రాధా మదనమోహన్ మందిరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 1976లో ప్రారంభమైన ఈ మందిరం ఐదు దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగుతోంది. గవర్నర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ నిర్వాహకులు, భక్తులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ. ఇస్కాన్ అబిడ్స్ 50 ఏళ్ల ప్రస్థానం భక్తి, సేవ, కరుణ, సంస్కారం, మానవ సంక్షేమానికి అంకితమైన ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. హరినామ సంకీర్తన, భగవద్గీత బోధనలు, ప్రసాద వితరణ, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల ద్వారా ఇస్కాన్ మానవీయ విలువలను పెంపొందిస్తోందని ప్రశంసించారు. యువత భగవద్గీతను చదివి, దాని విలువలను జీవితంలో ఆచరించాలని సూచించారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో సేవ, సామరస్య భావనలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!