

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన నయనతార ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో పాటు అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ ఆమె వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సాధారణంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకునే నయనతార, హిందీ సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. గతంలో అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించారు. చివరకు దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాతో, హీరో షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు మరోసారి బాలీవుడ్ నుంచి నయనతారకు భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైకు చెందిన మిని ఫిల్మ్స్ సంస్థ నిర్మించబోయే కొత్త సినిమాలో ఆమె నటించనున్నట్లు సమాచారం. కథ బలంగా ఉండటం, తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమె నటించిన టాక్సిక్ సినిమా కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!