
క్రీడలు

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో హీరోలు దర్శకులుగా మారే ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పటికే రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం తమ కొత్త చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుధీర్ బాబు కూడా అదే బాటలో నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, కొంతకాలంగా రూపొందిస్తున్న ఓ విభిన్న కథతో దర్శకుడిగా అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, కథపై పూర్తి నమ్మకంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్వయంగా తెరకెక్కించాలని సుధీర్ బాబు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో ఆయన అభిమానుల్లో కొత్త ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!