

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి భిన్నమైన ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణ ప్రచారానికి భిన్నంగా ప్రేక్షకులకు కథ నేపథ్యాన్ని మరింత చేరువ చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలపై చిత్రబృందం దృష్టి పెట్టినట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే ఆసక్తిని పెంచేలా వినూత్న ప్రచార వ్యూహాలను అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రవితేజతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో పాటు శబరిమల ఆలయ నేపథ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే భావోద్వేగ కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘అయ్యప్ప పడి పూజ’ పాట ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించగా, విడుదలకు ముందే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!