

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేకమైన సినిమాల శైలితో ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఆయన ఓ ప్రత్యేక బ్రాండ్‌గా మారారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగా, ఆ సినిమా పూర్తైన తర్వాత ‘యానిమల్’ సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. జపాన్‌లో జరిగిన యానిమల్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఆయన వర్చువల్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ‘యానిమల్ పార్క్’ షూటింగ్ వచ్చే ఏడాది(2027) మధ్యలో ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలిపారు.
ఈ సీక్వెల్లో కథ మరింత ఇంటెన్స్‌గా ఉంటుంది. పార్ట్ 1 లో ఒక యానిమల్‌ను చూపించాం, పార్ట్ 2 లో అలాంటి మరిన్ని యానిమల్ క్యారెక్టర్లు ఉంటాయని వంగా తెలిపారు. ముఖ్యంగా రణ్విజయ్ సింగ్ మరియు అజీజ్ హక్ అనే ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భీకర పోరాటమే ఈ సినిమా కథ. అందుకే దీనికి ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ సరిపోయిందని చెప్పారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ డబుల్ రోల్లో కనిపించనుండగా, యాక్షన్ మరియు ఎమోషన్స్ పార్ట్ 1 కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్.
యానిమల్ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విమర్శలు వచ్చినా వంగా తన కథనం, ఎమోషన్స్‌తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ‘స్పిరిట్’ పైనే ఉంది. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి వచ్చే ఏడాది (2027) జూన్ లేదా జూలైలో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. డార్క్ స్టోరీ, డబుల్ రోల్ రణ్‌బీర్, వంగా మార్క్ ఇంటెన్సిటీ కలిసి ఈ సీక్వెల్ మరో సంచలనంగా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!