
సినిమాలు

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రతిష్ఠాత్మక జగన్నాథ రథయాత్ర నేడు ఘనంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ప్రత్యేకంగా అలంకరించిన మూడు రథాలపై గుండిచా ఆలయానికి తరలివెళ్తారు. పవిత్ర రథాలను లాగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
రథయాత్ర ప్రారంభానికి ముందు ఒడిశా రాజు బంగారు చీపురుతో రథం వెళ్లే మార్గాన్ని శుభ్రం చేసే సంప్రదాయం నిర్వహిస్తారు. దీనిని ‘ఛేరా పహారా’ అని పిలుస్తారు. ఈ ఆచారం వినయానికి, భక్తికి ప్రతీకగా భావిస్తారు. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!