
క్రీడలు

అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పాటు, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా ఆయన ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాత్కాలికంగా AA23 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇంతకుముందు అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం #AA23 ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, రాకా షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!