

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ 2 – తాండవం’. భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా కోసం పాన్–ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్ ట్రైలర్ లాంచ్కు మేకర్స్ తేదీని ఖరారు చేశారు. అలాగే నెలాఖరులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.
ఈ ఈవెంట్కు ఆశ్చర్యకరమైన అతిథులు వస్తారనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
టాక్ ప్రకారం—
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
మరియు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇద్దరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద చర్చగా మారింది.
14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5 న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!