

‘హనుమాన్’ సినిమాతో భారీ విజయం సాధించి స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ఆయన ‘జై హనుమాన్’ అనే సినిమాను ప్రకటించాడు. అయితే సినిమా ప్రకటించి చాలా కాలం గడిచినా ఇప్పటివరకు షూటింగ్ మొదలుకాలేదు. గతంలో బాలకృష్ణ కుమారుడితో ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రకు కన్నడ నటుడు రిషబ్ శెట్టిని ఎంపిక చేశారు.
కానీ సినిమా ఆలస్యం కావడానికి కారణం ప్రశాంత్ వర్మ ఒకేసారి పలు ప్రాజెక్టులు సెట్ చేయడం, ప్రొడక్షన్ పనులపై ఎక్కువగా దృష్టి పెట్టడమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మకు ఒక షరతు పెట్టినట్టు సమాచారం. తన షూటింగ్ కోసం కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఇస్తానని, ఆ లోపు పూర్తిచేయకపోతే సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పారట. ప్రస్తుతం రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా బిజీగా ఉండటంతో టైమ్ వృథా చేయాలని అనుకోవడం లేదట.
ప్రశాంత్ వర్మ రీసెంట్ గా జై హనుమాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ మూడు నుంచి నాలుగు నెలల లోపు రిషబ్ శెట్టి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకొని మరొక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలి గాని, ఆయన ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి అక్కడ వర్క్ చూసుకోవడం లాంటివి ఎందుకు చేస్తున్నాడు అంటూ అతని మీద కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చేయడం వల్లే ఆయన చాలా వరకు డీలా పడిపోతున్నాడు…











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!