

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్లో “తెలుగు కోడలు”గా మారబోతుందనే టాక్ ఇండస్ట్రీ అంతా షాక్‌లో పడేలా చేస్తోంది! కొద్ది వారాల క్రితమే రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగిందని వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇద్దరూ చేతుల్లో ఉంగరాలతో కనిపించడంతో అభిమానులు ఇది కన్ఫర్మ్ అని చెప్పేస్తున్నారు. కానీ… రష్మిక మాత్రం మౌనం పాటిస్తూ, చిరునవ్వుతో మిస్టరీని ఇంకా కొనసాగిస్తోంది!
ఇటీవల ఆమె “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా ప్రమోషన్స్ కోసం జగపతి బాబు షో “జయమ్ము నిశ్చయమ్మురా”కి హాజరైంది. అక్కడే అసలు ఫన్ మొదలైంది! జగపతి బాబు సరదాగా అడిగాడు “ఇన్ని విజయ్‌లతో సినిమాలు చేస్తున్నావు, విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, దళపతి విజయ్... నీకు విజయ్ అనే పేరుతో ఏదో స్పెషల్ కనెక్షన్ ఉందేమో అనిపిస్తోంది!”
అప్పుడే రష్మిక సిగ్గుతో నవ్వేసింది. తర్వాత ఆయన ఆమె చేతిలో ఉన్న రెండు ఉంగరాలు చూపిస్తూ “ఇవి ఎందుకు రెండు? వీటిలో ఒకదాంట్లో ప్రేమ కథ దాగుందేమో!” అని టీజ్ చేయగానే రష్మిక ముఖం ఎర్రబడి ఫుల్ బ్లష్ మోడ్ ఆన్ అక్కడే ఆడియెన్స్ కూడా “విజయ్! విజయ్!” అంటూ అరవడంతో రష్మిక ఇంకా ఎగిరిపోయింది! ఇప్పుడు అంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు “అసలు ఆ ఉంగరం వెనక సీక్రెట్ ఏంటి?” అది తెలిసే ముందు షో చూడాల్సిందే అంటున్నారు నెటిజన్లు!










కామెంట్స్ (2)
రష్మిక–విజయ్ జంటపై మళ్లీ హాట్ టాపిక్ మొదలైంది!
This twist just made the rumors more interesting!