

టాలీవుడ్లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 26 న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో పెళ్లి జరుగుతుందనే కథనాలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదే సమయంలో పెళ్లి వేడుక ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందనే వార్త మరింత చర్చకు దారి తీసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ( Netflix) పెళ్లి వీడియో హక్కుల కోసం రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సెలబ్రిటీ పెళ్లిళ్లను ప్రత్యేక డాక్యుమెంటరీలుగా విడుదల చేసే ట్రెండ్ పెరిగిన నేపథ్యంలో, ఈ వేడుకను కూడా గ్లోబల్ ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించినట్లు సమాచారం. అయితే పెళ్లి పూర్తిగా వ్యక్తిగత విషయం కాబట్టి దాన్ని పబ్లిక్ ఈవెంట్‌గా మార్చాలనే ఉద్దేశం లేదని విజయ్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లీగల్ షరతులు, షూటింగ్ పరిమితులు, అతిథులకు కలిగే అసౌకర్యం వంటి విషయాలను కూడా వారు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయ్ తన రాబోయే సినిమాలైన రణబలి, రౌడీ జనార్ధన్ పై దృష్టి పెట్టగా, రష్మిక కూడా బాలీవుడ్ మరియు సౌత్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయనే వీడియోలు వైరల్ అవుతున్నా, అవి నిజమా లేక రూమర్స్ మాత్రమేనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ నెల (ఫిబ్రవరి) 26 న అసలు విషయం బయటపడే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!