
రాజకీయాలు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఢిల్లీకి చేరుకున్నారు. నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని పురానా ఖిలాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) నాగరిక సంభాషణల వేదికలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. 2023 మేలో బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటన తర్వాత దేశంలో అడుగుపెట్టిన తొలి పాకిస్థాన్ ఫెడరల్ మంత్రిగా ముసాదిక్ మాలిక్ నిలిచారు.
పహల్గామ్ ఉగ్రదాడి, సింధు జలాల ఒప్పందం వంటి అంశాలపై భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బహుళపక్ష సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ తన ప్రతినిధిని భారత్కు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!