
రాజకీయాలు

కావేరీ జలాల వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా సుమారు 11 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అదనపు నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే తాజాగా ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో కావేరీ జలాల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!