
రాజకీయాలు

కేరళ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సతీషన్ ఈరోజు శబరిమల సన్నిధానంలో శ్రీ ధర్మశాస్తను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలధారణతో పంబా చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ నడక మార్గం ద్వారా శబరిమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు సమాచారం. సీఎం బాధ్యతలు చేపట్టే ముందు అయ్యప్పస్వామి ఆశీస్సులు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సతీషన్ రాకతో శబరిమల ప్రాంతంలో భక్తుల సందడి కనిపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!