

పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (ఈ-20) శాతం పెంచితే వాహనాలు దెబ్బతింటాయనే ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ, ఇథనాల్ కలోరిఫిక్ విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో మైలేజీ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే అధిక ఇథనాల్ మిశ్రమంతో నడుస్తున్న వాహనాలను పరిశీలించినప్పుడు మైలేజీ తగ్గుదల పరిమితంగానే ఉంటుందని, వాహనాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, వాటి వాడకం వల్లే కాలుష్యం పెరుగుతోందని తెలిపారు. ఈ దిగుమతులను తగ్గించడానికి స్వదేశీ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. సోషల్ మీడియాలో ఇథనాల్ వల్ల వాహనాలు డ్యామేజ్ అవుతాయని ప్రచారం జరుగుతున్నదాన్ని ఆయన ఖండించారు. ఈ-20 ఇంధనంతో దెబ్బతిన్న ఒక కారును అయినా చూపించాలని సవాల్ విసిరారు. బ్రెజిల్‌లో 1970 నుంచే ఇథనాల్ మిశ్రమం విజయవంతంగా వాడుతున్నారని గుర్తుచేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!