

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంస్థకు ఇది ప్రతిష్టాత్మకమైన 10వ చిత్రం. “Love Will Spark Again” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ ప్రేమ, ఆశ, కొత్త ఆరంభాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో కనిపించిన దుల్కర్–పూజా కెమిస్ట్రీకి మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఫస్ట్ లుక్ ఆ అంచనాలను మరింత పెంచింది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఓ కాంపౌండ్ గోడపై కూర్చొని ఆహ్లాదకరమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. వారి సింపుల్ లుక్, సహజమైన చిరునవ్వులు, ప్రశాంతమైన నేపథ్యం ప్రేమకథలోని అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీరిద్దరూ క్లాస్‌మేట్స్‌గా కనిపించేలా రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలను మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు హృదయాన్ని హత్తుకునే అనుభూతిని అందించనున్నట్లు చిత్రబృందం భావిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!