

అయోధ్య రామాలయంలో హుండీల ద్వారా వచ్చిన విరాళాల సొమ్ము దోచుకుని, దాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులుగా మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన డబ్బు మూలాలను దాచిపెట్టేందుకు నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో బయటపడింది. ఆలయం నుంచి రహస్యంగా తీసుకున్న నగదును ముందుగా బంధువులు, స్నేహితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి, తర్వాత తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారని అధికారులు గుర్తించారు.
కోర్టు అనుమతితో పోలీసులు విచారించిన నిందితులు అనుకూల్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, కరుణేశ్ పాండే ఈ విషయాలను వెల్లడించినట్టు సమాచారం. విరాళాల సొమ్ములో కొంత భాగాన్ని స్టాక్స్ మరియు ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులుగా మళ్లించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో భాగంగా నిందితులు, వారి బంధువులు, స్నేహితులకు సంబంధించిన సుమారు 30 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. ఇదే సమయంలో, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్, ఆలయ నిర్వహణకు సంబంధించిన ఎస్‌ఓపీని మాజీ సభ్యుడు మిశ్రా ఎస్‌బీఐతో కలిసి రూపొందించారని సిట్‌కు లేఖ ద్వారా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!