
గాసిప్స్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు తెలంగాణకు రానున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రుల వరుస పర్యటనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నితిన్ నబీన్, జేపీ నడ్డా వంటి ప్రముఖ నేతలు రాష్ట్రాన్ని సందర్శించగా, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ పర్యటనతో రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.
పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కొండకల్‌లోని మేధా బోగీస్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మేధా సర్వో డ్రైవ్స్ ఫ్యాక్టరీను పరిశీలించనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!