

గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్-2026లో మాట్లాడిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సస్టైనబుల్ ఏఐ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ల నిర్మాణంతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వనరులను ఏఐ సంస్థలు అత్యంత బాధ్యతతో వినియోగించాలని, వ్యవసాయానికి దక్కాల్సిన నీటిపై ఏఐ పోటీ పడకూడదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి 'పీపుల్స్ క్రెడిట్' భావనను పరిచయం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐ పెట్టుబడుల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు, గ్రామీణ యువతకు, సాంప్రదాయ వృత్తులకు చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ యువతతో పాటు సిరిసిల్ల చేనేత కార్మికులకు కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు స్వాగతం పలుకుతూనే ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!