
టెక్నాలజీ

తెలంగాణ రక్షణ సమితి పేరుతో తన రాజకీయ పార్టీని నమోదు చేయాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీకి "తెలంగాణ రక్షణ సమితి" పేరును కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె పిటిషన్‌లో కోరారు.
అయితే, ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు ముందుగా సమగ్రంగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ దశలో పిటిషన్‌ను విచారించడం ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. పార్టీ నమోదు ప్రక్రియపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని కూడా న్యాయస్థానం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!