
రాజకీయాలు

కేరళలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో వాతావరణ శాఖ వయనాడ్, కోళికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు. మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న మెప్పాడి ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!